Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి.. మొసలికి చాలా దగ్గరగా ఫ్రెంచ్ మహిళ సెల్ఫీ.. కాలు కొరికేసిన?

సోషల్ మీడియా, ఐఫోన్ల ప్రభావంతో యువతకు సెల్ఫీలపై పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం నేటి యువత ఎలాంటి సాహసానికైనా వెనుకాడట్లేదు. అయితే ఇలాంటి సాహసాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. ఇలా సెల్ఫీ మోజులో ఎంతోమంది

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (16:46 IST)
సోషల్ మీడియా, ఐఫోన్ల ప్రభావంతో యువతకు సెల్ఫీలపై పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం నేటి యువత ఎలాంటి సాహసానికైనా వెనుకాడట్లేదు. అయితే ఇలాంటి సాహసాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. ఇలా సెల్ఫీ మోజులో ఎంతోమంది మృతి చెందుతున్నప్పటికీ..  కొందరికి సెల్ఫీ పిచ్చి ఏమాత్రం దూరం కావట్లేదు. ప్ర‌మాద‌కర ప్ర‌దేశాల్లో, క్రూర మృగాల‌తో సెల్ఫీల‌కు ప్రయత్నించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. 
 
ఇలాంటి ఘటనే థాయ్‌లాండ్‌‌లోని ఖయో యాయ్‌ జాతీయ పార్కులో మ‌రొక‌టి చోటుచేసుకుంది. మొస‌లితో సెల్పీ తీసుకుంటూ మారియల్‌ బెనెటులియర్‌(41) అనే ఫ్రెంచ్‌ మహిళ గాయాలకు పాలైంది. సెల్ఫీ తీసుకుంటుండగా మొసలి ఆమె కాలిని కొరికేసింది. సదరు మహిళ మొసలికి బాగా దగ్గరగా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పార్కు నిర్వాహకులు తెలిపారు. 
 
పార్కులో సూచించిన హెచ్చ‌రిక‌ల బోర్డుల‌ను ప‌ట్టించుకోకుండా బెనెటులియర్ దుస్సాహానికి ఒడిగట్టిందని.. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వైద్యులు చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments