Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్‌లో ఘోరం.. ఉపాధ్యాయుడి తల నరికిన స్టూడెంట్...

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:39 IST)
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ దుండగుడు ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసి అతడి తల నరికాడు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. రాజధాని పారిస్‌ శివార్లలోని కాన్‌ఫ్లాన్స్ సౌ హోనోరీ స్కూల్ దగ్గర ఈ దారుణం జరిగింది.
 
పోలీసుల వివరాల ప్రకారం దుండగుడి వయసు 18 ఏళ్లని తెలుస్తోంది. బాధిత ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏడాది క్రితం ఫ్రెంచ్ పత్రిక చార్లీ హెబ్డోలో ప్రచురించిన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించినట్లు తెలుస్తోంది. యాంటీ టెర్రరిస్ట్ టీమ్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.
 
అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉపాధ్యాయుడు ఇస్లామిక్ తీవ్రవాద దాడికి గురయ్యారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు. ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతిచ్చేవారని చెప్పారు. ఇది 'ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్' అన్నారు. 
 
హింసకు వ్యతిరేకంగా దేశ పౌరులందరూ ఒక్కటవ్వాలని మేక్రాన్ విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదం ఎప్పటికీ గెలవలేదన్నారు. అటు ఫ్రాన్స్ విద్యా మంత్రి తన ట్వీట్‌లో ఒక ఉపాధ్యాయుడిని చంపడం అంటే అది నేరుగా ఫ్రాన్స్ మీద దాడి జరపడమేనని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments