Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై ఉన్మాద చర్యలను ఉపేక్షించం: కృతికా శుక్లా హెచ్చరిక

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:35 IST)
మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని దిశ ప్రత్యేక అధికారి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. విజయవాడలో  ప్రేమోన్మాది ఘాతుకం ఆందోళనకరమని, మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని బాధితురాలి ఇంటికి వచ్చిన కృతికా శుక్లా ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి తప్పని సరిగా న్యాయం చేస్తామని, ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని ఓదార్చారు.

నిందితుడిపై దిశ చట్టం స్పూర్తితో వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, ఈ తరహా చర్యలకు ముగింపు పలకాలన్న ధ్యేయంతోనే ముఖ్యమంత్రి దిశ చట్టానికి రూపకల్పన చేసారని వివరించారు.

కష్టాలలో ఉన్న మహిళలు ఎవరైనా సహాయ సంఖ్యలు 100/112/181 ఉపయోగించుకోవాలని, మరో వైపు దిశ యాప్, పోలీస్ సేవ యాప్  అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఆపదలో ఉన్న వారు వీటికి సందేశం పంపితే సకాలంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి బాధితులను రక్షించే అవకాశం ఉందని తెలిపారు.

దారుణ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మహిళ రక్షణే ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం మని, నేరాలకు  పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కృతికా శుక్లా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments