ఎంత ధైర్యం... కొండ చిలువను చంపేసిన మహిళ... ఎక్కడ? (Video)

ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ... ఏకంగా కొండ చిలువను చంపేసింది. తన మేక ప్రాణాలు రక్షించుకునేందుకు ఏకంగా ఆ మహిళ పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే....

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (16:33 IST)
ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ... ఏకంగా కొండ చిలువను చంపేసింది. తన మేక ప్రాణాలు రక్షించుకునేందుకు ఏకంగా ఆ మహిళ పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే....
 
ప్లోరిడాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొండ చిలువలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటి నుంచి తమ పశుపక్ష్యాదులను రక్షించుకోవడం స్థానికులకు తలకుమించిన భారంగా ఉంది. అయితే, రేచల్‌ ఎలిజబెత్ అనే మహిళ నైపాల్‌లో నివసిస్తోంది. ఆమె, రోజు తన మేకల మంద ఉండే ప్రాంతాన్ని శుభ్రపరించేందుకు వస్తుంది. 
 
బుధవారం కూడా ఆమె మేకల మంద ఉండే ప్రదేశానికి వచ్చింది. అయితే మేకలమంద ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండగా, మేక మూలుగుతున్న శబ్దం ఆమెకు వినిపించింది. ఏం జరుగుతుందో చూద్దామని ఆమె కొంచెం దగ్గరగా వెళ్లింది. ఆ దృశ్యాన్ని చూసి షాకయ్యింది.
 
వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరపడం ప్రారంభించింది. తుపాకీతో కొండచిలువ తలపై కాల్చింది. వెంటనే అది మేక తలను వదిలేసి, మెలితిరిగిపోయింది. దానికి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని, రేచల్, దానిపై నాలుగు రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. దాంతో ఆ కొండచిలువ అక్కడిక్కడే చనిపోయింది. ఆ మొత్తాన్ని రేచల్ వీడియో తీసి తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

కార్ డ్రైవర్ సెల్వం జీవిత కథగా కార్మేని సెల్వం, థియేట్రికల్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్

Vrushakarma Glimpse Review: కెరీర్ లో బెస్ట్ మూవీగా వృషకర్మ వుంటుంది : నాగ చైతన్య

తనుజకు పుట్టినరోజు.. దివ్వెల మాధురితో శ్రీవారి దర్శనం (video)

Saravanan: కుటుంబ పోరాటంలో ఖైదీగా మారిన కథతో శరవణన్ సినిమా లీడర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments