Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్‌లో 10 కేజీల బీఫ్ ఫ్రై ఆరగించి... బీఫ్ బ్యాన్‌పై చర్చించిన ఎమ్మెల్యేలు

దేశంలో వామపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఏది చేసినా వింతగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా గోవుల విక్రయాలపై నిషేధం విధించింది. అంటే

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (15:14 IST)
దేశంలో వామపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఏది చేసినా వింతగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా గోవుల విక్రయాలపై నిషేధం విధించింది. అంటే పరోక్షంగా బీఫ్ విక్రయాలపై నిషేధమన్నమాట. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. అలాగే, చర్చకూడా సాగుతోంది.
 
ఈ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ బీఫ్ బ్యాన్‌పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ క్యాంటీన్‌లో బీఫ్ ఫ్రైను ప్రత్యేకంగా తయారు చేశారు. సమావేశాలకు వెళ్లే ముందు ఎమ్మెల్యేలంతా బీఫ్ ఫ్రైని ఆరగించి, ఆ తర్వాత అసెంబ్లీలో బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు లోనికెళ్లారు. 
 
దీనిపై క్యాంటీన్ సిబ్బంది మాట్లాడుతూ, బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఉండటంతో ఎమ్మెల్యేలంతా వస్తారని భావించి... 10 కేజీల బీఫ్‌ను తీసుకొచ్చి బాగా రుచికరంగా వండామన్నారు. తాము చేసిన బీఫ్ ఫ్రైను ఆరగించిన తర్వాతే ఎమ్మెల్యేలు చర్చకు వెళ్లారని చెప్పారు. సమావేశంలో ఇష్టమైన ఆహారం తినకుండా అడ్డుకోవడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments