Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీజ్‌బర్గర్ ఇవ్వలేదని సోదరుడిని కాల్చి చంపిన మరో సోదరుడు!

Webdunia
సోమవారం, 9 మే 2016 (09:34 IST)
చీజ్‌బర్గర్ ఒక సోదరుడి ప్రాణాలు తీసిందంటే నమ్ముతారా? అవును నిజమే బర్గర్ ఇవ్వలేదని క్షణికావేశంలో సహోదరుడినే అతికిరాతకంగా తుపాకీతో కాల్చిచంపాడో కిరాతకుడు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫోర్లిడాలోని సెయింట్ క్లౌడ్ నగరంలో నివసించే బెంజమిన్, నికోలస్ మిద్దెన్‌డార్ఫ్‌లు ఇద్దరు అన్నదమ్ములు. 
 
గురువారం రాత్రి బయట నుంచి ఇంటికి వచ్చిన బెంజమిన్ తన సోదరుడిని చీజ్‌బర్గర్ ఇవ్వమని అడిగాడు. అతడు ససేమిరా కుదరదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ పెద్ద ఘర్షణకు దారితీసింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న బెంజమిన్ తన సోదరుడైన నికోలస్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దిగడంతో నికోలస్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. 
 
తుపాకీ శబ్దం రావడంతో తల్లి పరుగున వచ్చి చూసేసరికి నికోలస్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అనంతరం బెంజమిన్ 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. జరిగిన విషయమంతా పోలీసులకు చెప్పి అనంతరం లొంగిపోయాడు. అతని దగ్గర నుంచి పోలీసులు 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments