Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం సెలవు ఇవ్వలేదనీ రూ.152 కోట్ల అపరాధం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (16:05 IST)
ఓ మహిళా ఉద్యోగినికి ఆదివారం సెలవు ఇవ్వకుండా పని చేయించుకున్నందుకు కంపెనీకి రూ.152 కోట్ల అపరాధం విధిస్తూ ఓ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ కోర్టు వెలువరించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైతీ దేశానికి చెందిన మేరీ అనే ఓ మహిళ ఫ్లోరిడాలోని మియామీకి వలస వచ్చింది. అక్కడే ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో పనిలో చేరింది. ఆమె విధుల్లో చేరిన కొత్తల్లో ఆదివారం సెలవు ఇచ్చింది. హోటల్‌లో ఆరు రోజులు, చర్చిలో ఆదివారం పని చేస్తూ పోషణ సాగిస్తూ వచ్చింది. 
 
ఆ తర్వాత హోటల్ కిచెన్ మేనేజరుగా వచ్చిన కొత్త వ్యక్తి ఆ మహిళకు ఆదివారం సెలవును రద్దు చేసి.. పనికి రావాలంటూ ఆదేశించారు. ఆదివారం పనిచేయడం తమ మతాన్ని అగౌరవించినట్లు అవుతుందని మేరి చర్చి ఫాదర్ చేత లేఖ రాయించారు.
 
అయినప్పటికీ ఆ మేనేజరు అంగీకరించకుండా పనికి రప్పించుకునేవాడు. దీంతో దాదాపు పదేళ్ల పాటు ఆ మహిళ సెలవు లేకుండా పని చేసింది. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆమె తోటి సిబ్బంది సాయంతో ఆదివారం సెలవు తీసుకుంటూ వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మేనేజర్ మేరీని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బాధితురాలు ఈఈఓసీ (సమాన ఉద్యోగ అవకాశ కమిషన్‌)ను ఆశ్రయించింది.
 
ఈ కేసును విచారించిన ఫ్లోరిడా ఫెడరల్ కోర్టు మేరీ మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అదనంగా పనిచేయించినందుకు 21.5 మిలియన్ డాలర్లు(రూ.152.95 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments