Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వాన్ లోయలో 100 మంది చైనా సైనికుల మృతి???

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:44 IST)
గత నెల 15వ తేదీన తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ సైన్యానికి చెందిన 21 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపున కూడా అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, 40 నుంచి 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మృతుల సంఖ్యపై చైనా ఎన్నడూ పెదవి విప్పలేదు. 
 
ఈ క్రమంలో చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారి క్సీ ఒకరు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదేసమయంలో చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని కూడా ఆరోపించారు. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరపు నుంచి ఎన్నడూ బయటకు రాదని ఆయన అన్నారు.
 
గాల్వాన్ లోయలో పెద్ద యుద్ధమే జరిగిందనీ, అక్కడ 100 మందికిపైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన సీపీఏ మాజీ సైనికుడు క్సీ, ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలమని అన్నారు. క్సీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments