Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైమరీ స్కూలులో అవమానం: టీచర్‌కు 101 సార్లు కత్తిపోట్లు.. 30 ఏళ్ల తర్వాత..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (12:17 IST)
బెల్జియంలో దారుణం జరిగింది. 101 సార్లు కత్తితో పొడిచి టీచర్‌ను పొట్టనబెట్టుకున్నాడు ఓ ఓల్డ్ స్టూడెంట్. 30 ఏళ్ల తర్వాత తనకు ప్రైమరీ స్కూల్ ప్రాయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ విద్యార్థి. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రైమరీ స్కూల్‌ చదివేటప్పుడు తనను అవమానించారన్న అక్కసుతో ఉపాధ్యాయురాలిని కడతేర్చాడు మాజీ విద్యార్థి.
 
2020లో బెల్జియంలో ఈ హత్య జరగ్గా.. గుంటర్‌ ఉవెంట్స్‌ (37)తాజాగా తన నేరాన్ని అంగీకరించాడని ప్రాసిక్యూటర్‌ గురువారం తెలిపారు. 
 
1990 ప్రారంభంలో నిందితుడికి ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్ధిగా ఉన్న సమయంలో... తనను టీచర్‌ మారియా వెర్లిండెన్‌ తీవ్రంగా తిట్టారని నిందితుడు వాంగ్మూలమిచ్చినట్లు చెప్పారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక. 2020లో ఆంటెవెర్స్‌ సమీపంలో ఉన్న హెరెంటల్స్‌లోని ఆమె నివాసంలో 2020లో హత్య చేశాడు. 
 
101 సార్లు కత్తితో పొడవడంతో టీచర్‌ చనిపోయారు. కానీ డైనింగ్‌ టేబుల్‌ మీద డబ్బులున్న పర్సు అలా ఉండటంతో .. ఇది దోపిడీ హత్య కాదని భావించిన పోలీసులు .. నిందితుడు కోసం గాలించారు. ఆపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments