Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవర్ గ్రాండేతో చైనా ప్రపంచ దేశాలకు షాకివ్వనుందా?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (16:25 IST)
Evergrande
ప్రపంచంలో అతిపెద్ద దివాలా తీసిన కంపెనీ ఏది అంటే అమెరికాకు చెందిన లెమన్ బ్రదర్స్ అని చెప్తాం. ఈ కంపెనీ 2008 లో 600 బిలియన్ డాలర్ల దివాళా తీసింది. అప్పట్లో ఈ కంపెనీ దివాళా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అలాంటి సంక్షోభం ఇప్పుడు చైనా నుంచి రాబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. 
 
చైనా జీడీపీలో 29శాతం రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఎవర్ గ్రాండే. ఈ కంపెనీ ఇప్పుడు దివాళా తీయబోతుంది. ఎవర్ గ్రాండే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్లమేర చెల్లింపులు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీ 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులను చేపట్టింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 
 
ఇలాంటి బడా కంపెనీ ఇప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది అంటే అర్థం చేసుకొవచ్చు. ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై సెప్టెంబర్ 23 వ తేదీకి 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సి ఉంది. 
 
అయితే, ఈ వడ్డీని ఇప్పట్లో చెల్లించలేమని కంపెనీ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చైనాలో కుదేలయింది. దీంతో కొట్లాది ప్రాపర్టీలు ఖాళీగా ఉన్నాయి. కొనేవాళ్లు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. చైనా ప్రభుత్వం ఈ కంపెనీలను ఆదుకోకుంటే ఆ సంక్షోభం ప్రభావం ప్రపంచదేశాలపై పడే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం