Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని హనీమూన్‌కు తీసుకెళ్లిన కుమార్తె.. అల్లుడుపై మోజుపడిన అత్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (21:44 IST)
తల్లిదండ్రులు తమ కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి జీవితాలు బాగుండాలని తమ ఇష్టదైవాలను మొక్కుకుంటారు. ముఖ్యంగా, మెట్టినింటికి వెళ్లే తన కుమార్తె బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. కానీ, ఆ తల్లి మాత్రం కన్నకుమార్తె జీవితాన్నే నాశనం చేసింది. అల్లుడుపై మోజుపడి అక్రమ సంబంధం పెట్టుకుంది. చివరకు గర్భందాల్చింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్‌కు చెందిన లౌరెన్ వాల్ అనే యువతికి 34 యేళ్లు. ఈమె పౌల్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లికి ముందే తొందరపడటంతో ఓ బిడ్డకు కూడా తల్లి అయింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తల్లి జూలీకి చెప్పింది. అప్పటికే ఓ బిడ్డకు తల్లి కావడంతో మరోమార్గం లేక లౌరెన్ - పౌల్ వివాహానికి సమ్మతించింది. 
 
ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ హనీమూన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే, తమకు బిడ్డ కూడా ఉండటంతో అతన్ని కూడా తీసుకెళ్లాలని భావించారు. ఆ బిడ్డను తమ వెంట హనీమూన్‌కు తీసుకెళితే ఎంజాయ్ చేయలమని భావించిన లౌరెన్ వాల్ తమ వెంట తల్లి జూలీని కూడా తీసుకెళితే, బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటుందని భావించారు. ఈ నిర్ణయమే ఆమె పచ్చని సంచారంలో చిచ్చుకు కారణం అవుతుందని ఊహించలేక పోయింది. 
 
ఆ తర్వాత తమ ప్లాన్‌లో భాగంగా, భార్యాభర్తలు తమ బిడ్డ, అమ్మ జూలీతో కలిసి హనీమూన్‌కు వెళ్లి, ఓ హోటల్‌లో పక్కపక్కనే గదులను అద్దెకు తీసుకున్నారు. అక్కడ మూడు వారాల పాటు బిడ్డను తల్లి జూలీ వద్ద వదిలేసి లౌరెన్ - పౌల్‌లు హోటల్ గదిలో ఎంజాయ చేయసాగారు. దీన్ని తల్లి జూలీ జీర్ణించుకోలేక పోయింది. ఆమెలో కూడా కామ కోర్కెలు చిగురించాయి. 
 
అంతే.. మెల్లగా అల్లుడుని బుట్టలో వేసుకుంది. కుమార్తె హోటల్ గది నుంచి బయటకు వెళ్లినపుడల్లా అల్లుడితో పడక సుఖం పంచుకోసాగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అల్లుడు - అత్తల మధ్య రహస్య రంకుబాగోతం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ వచ్చింది. అయితే, అత్త దగ్గర మంచి సుఖాన్ని పొందిన పౌల్.. భార్య పట్ల అలక్ష్యం చేయసాగాడు. ఆమెతో శారీరకసుఖం పంచుకోవడం మానేశాడు. 
 
దీంతో అనుమానం వచ్చిన లౌరెన్... అమ్మపై ఓ కన్నేసి.. వారిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని కనిపెట్టింది. అయితే, కుమార్తెను తన మాయమాటలతో ఆ సమయానికి బురిడీ కొట్టించింది. ఇంతలో లౌరెన్ చెల్లి ఇంటికి వచ్చి, తల్లి మొబైల్‌ను చెక్ చేసింది. ఇందులో అల్లుడు - అత్త మధ్య శృంగార చాటింగ్ జరిగిన విషయాన్ని గుర్తించి అక్కకు చెప్పింది. అంతే.. ఈ విషయం తెలియగానే పౌల్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తల్లి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో ఓ రోజున తన భర్తతో తల్లి వీధుల్లో తిరగడం లౌరెన్ కంటపడింది. అపుడు తల్లిని నిశితంగా పరిశీలించగా ఆమె కడుపు ఎత్తుగా కనిపించింది. అంటే.. తన భర్త ద్వారా తల్లి గర్భందాల్చినట్టు తెలుసుకుంది. తన భర్తతో కలిసి పిల్లలు కనేందుకు కూడా ఆమె సిద్ధమైందని తెలిసి మరింత కుంగిపోయింది. ఆ ఇద్దరికి పెళ్లి కూడా జరిగిపోయిందని తెలిసి కన్నీరుమున్నీరైంది. కన్న తల్లే మోసం చేయడం తట్టుకోలేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments