Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్‌ఫ్రెండ్‌‌ ద్వారా తొలి సంతానం పొందిన ఐదుగురు పిల్లల స్పేస్ ఎక్స్ సీఈఓ

Webdunia
మంగళవారం, 5 మే 2020 (10:40 IST)
స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్ స్టాక్ మార్కెట్‌నే కుదిపేసింది. తానుత సీఈవోగా ఉన్న టెస్లా కంపెనీ ఈక్విటీ షేర్ విలువ స్టాక్ మార్కెట్‌లో అధికంగా ఉందంటూ ఈ ట్వీట్ సారాంశం. ఇది పెనుదుమారాన్ని రేపగా, ఈ ఒక్క ట్వీట్ ఆ సంస్థకు వందల కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చిపెట్టుంది. ఫలితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంతలోనే ఎలాన్ మస్క్‌ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వార్తను ఆయన ఓ ట్వీట్ రూపంలో వెల్లడించారు. తాను సహజీవనం చేస్తున్న తన ప్రియురాలు గ్రిమీస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ ట్వీట్ చేశారు. తల్లీ బిడ్డా క్షేమంగానే ఉన్నారనీ అందులో పేర్కొన్నారు. 
 
48 యేళ్ళ మస్క్.. 2018 నుంచి సంగీత కళాకారిణి గ్రిమీస్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు. గ్రిమీస్ గర్భం దాల్చిందని గతంలోనే వార్తలు వెలువడగా, బిడ్డ జననంపై అప్ డేట్ ఇవ్వాలని పలువురు ట్విట్టర్‌లో కోరారు. దీంతో మస్క్ స్పందిస్తూ, సోమవారం నాడు 'మరికొన్ని గంటల్లో...' అని మొదట, ఆపై 'తల్లీ, బిడ్డా క్షేమమే' అని ఈ తెల్లవారుజామున ట్వీట్లు చేశారు. బిడ్డ గురించి అంతకుమించిన సమాచారాన్ని ఆయన వెల్లడించలేదు.
 
నిజానికి ఎలాన్ మస్క్‌కు ఇప్పటికే ఐదుగురు సంతానం ఉంది. ఈయన తన జీవితంలో మూడుసార్లు విడాకులు పొందారు. అందులో రెండుసార్లు ఒకే యువతి నుంచి పొందడం గమనార్హం. ఇకపోతే, గ్రిమీస్‌కు తొలి కాన్పు ఇదే. ఈమె అసలు పేరు కార్లీ బౌచర్. తానిప్పుడు గర్భంతో ఉన్నానని గత జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడిస్తూ, ఓ టాప్ లెస్ ఫోటోను ఆమె విడుదల చేయగా, అది వైరల్ అయింది. అంతకుముందు 2018లో జరిగిన 'మెట్ గాలా' కార్యక్రమంలో వీరిద్దరూ తొలిసారిగా కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments