Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

ఠాగూర్
సోమవారం, 14 జులై 2025 (16:15 IST)
ఇండోనేషియాలో మరోమారు భారీ భూకంపం సంభవించింది. తులాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. అయితే, సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
పశ్చిమ ఇండోనేషియాలో సోమవారం మధ్యాహ్నం 12.49 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం కారణంగా అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ భూకంపం వచ్చిన తర్వాత జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. 
 
ఇండోనేషియాను నిత్యం భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతుంటాయి. 2004లో 9.1 తీవ్రవతతో ఏర్పడిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలో 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments