టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.41 గంటల సమయంలో ఈ భూకంపం రాగా, రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున 2.41 గంటల సమయంలో భూకంపం వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు కనిపించాయని, మూడు రోజుల క్రితం కూడా టిబెట్‌లో భూకంపం వచ్చినట్టు ఎన్.సి.ఎస్ వెల్లడించింది. అయితే, అది రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని తెలిపింది. ఎన్.సి.ఎస్ వెల్లడించిన వివరాల మేరకు.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మే 8వ తేదీన ఓ భూకంపం వచ్చింది.
దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో ఈ ప్రాంతాన్ని కుదిపేసింది. ఇలాంటి భూకంపాలు భామి ఉపరితలానికి దగ్గరగా ఎక్కువ శక్తిని విడుదల చేయడం వల్ల లోతైన భూకంపాల కంటే ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఈ కారణంగా భూప్రకంపనలకు భవన నిర్మాణాలు కూలిపోయి ప్రాణ నష్టానన్ని కలిగిస్తుందని ఎన్.సి.ఎస్ తెలిపింది.