Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో కండోమ్స్... కొకైన్ స్మగ్లింగ్ ఎలా?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (15:12 IST)
స్మగ్లర్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు వివిధ రకాల కొత్త టెక్నిక్స్‌ను అనుసరిస్తున్నారు. వాటిని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా గుర్తించి ఛేదిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కొకైన్‌ను కండోమ్‌ల ద్వారా స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి విమానాశ్రయ అధికారులకు చిక్కారు. ఆ కండోమ్స్ అన్నీ కూడా అతని కడుపులో ఉండటనాన్ని గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దుబాయి నుంచి ఈజిప్టుకు వెళ్లేందుకు ఓ యువకుడు వచ్చాడు. అతని పాస్‌పార్టును ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆయన కడుపులో ఏదో పదార్థం ఉన్నట్టు అనుమానించారు. పిమ్మట ఆయన్ను వేరే గదికి దీసుకెళ్లి స్కానింగ్ చేశారు. 
 
ఈ స్కానింగ్‌లో అతని కడుపులో కండోమ్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటిని వైద్యులకు చూపించగా, వారు షాకయ్యారు. అతని కడుపులో ఉన్న కండోమ్‌ల నిండా కొకైన్ కుక్కివున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత అతని కడుపులో నుంచి 80 కండోమ్స్‌ను వెలికి తీశారు. 
 
అలా ఆ డ్రగ్స్‌ను ఈజిప్టు తీసుకెళ్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దాంతో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. లక్ష దీనార్లు (సుమారు రూ.20 లక్షలు) జరిమానా విధించింది. శిక్షాకాలం పూర్తికాగానే అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం