Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మీ అక్క కంటే నువ్వే అందంగా ఉన్నావు' : సీఐ వెకిలి చేష్టలు

Advertiesment
'మీ అక్క కంటే నువ్వే అందంగా ఉన్నావు' : సీఐ వెకిలి చేష్టలు
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:17 IST)
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. సాయం వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కేసు త్వరితగతిన పరిష్కారం కావాలంటే నాకేంటి.. అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. సరాదాలు తీర్చమంటున్నారు. ఫోనులో పిచ్చాపాటిగా మాట్లాడమని వేధిస్తున్నారు.. పార్కులు - బీచ్‌లకు రమ్మంటు సతాయిస్తున్నారు. ఇలాంటి వెకిలి వేషాలే ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేశారు. చివరకు విషయం పోలీసు పెద్దల దృష్టింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురానికి చెందిన పల్లా కృష్ణకుమారి అనే యువతి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ వైజాగ్‌లోని ఎంవీఎస్ కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివశిస్తోంది. ఈమె తన మేనమామ టి.విజయభాస్కర్‌తో ఏడేళ్ళ నుంచి ప్రేమలో ఉంది. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంశించాడు. చివరకు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కృష్ణకుమారి తనకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్ 27వ తేదీన ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసేందుకు కృష్ణవేణి చెల్లికూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 
 
ఆ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సన్యాసి నాయుడు కృష్ణవేణి చెల్లిపై కన్నేశాడు. ఆ యువతికి ఫోన్ చేసి వేధించసాగాడు. మీ అక్క కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగడ్తల వర్షం కురిపించాడు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే మాకు కనిపించవన్నమాట.. అంటూ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. 
 
ఖాళీ చూసుకుని తనతో బయటకు రావాలని ప్రతిపాదించడంతో ఆ యువతి అవాక్కైంది. ఎందుకు అలా అంటున్నారని ఆ యువతి ప్రశ్నించింది. ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదా అంటూ సీఐ ప్రశ్నించాడు. నీతో మాట్లాడాలని, కలవాలని, ప్రేమ కొనసాగించాలని ఉందంటూ పేర్కొన్నారు. 
 
పైగా, తండ్రిలేడు, ఇద్దరూ ఆడపిల్లలో చదువుకుంటున్నారు. డబ్బులు అవసరం ఉంటాయి. బయటకు వస్తావా అంటూ సీఐ డైరెక్టుగా అడగడంతో ఆమె అవాక్కైంది. అప్పటికీ ఆయన తన బుద్ధిని మార్చుకోలేదు. నీ వయస్సు ఎంత. 20 యేళ్ల లోపు అమ్మాయిలా క్యూట్‌గా ఉన్నావు.. మీరు ఎక్కడ ఉంటున్నారు. బయటకు ఎపుడు వస్తావు. ఒకసారి బీచ్‌కు రావొచ్చుకదా.. నిన్ను కలవాలని, మాట్లాడాలని, నీతో ప్రేమ కొనసాగించాలని ఉంది. ఎంతసేపూ మీ అక్క, కుటుంబం గురించే ఆలోచిస్తావా? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చి....