Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న డోనాల్డ్ ట్రంప్!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:41 IST)
అమెరికాలో జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ దాడి తదనంతర పరిణామాలు నేపథ్యంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికల నుంచి ట్రంప్‌ నిషేధానికి దారి తీశాయి.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నది అధ్యక్షుడుగా కాదు.. సామాజిక మాధ్యమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదేంటి ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిషేధించాయి కదా! మళ్లీ ఎలా వస్తారనేగా మీ అనుమానం. 
 
అయితే, ట్రంప్‌ ఈ సారి తనను తొలగించిన వేదికల నుంచి కాకుండా.. తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నారని సమాచారం. రెండు లేదా మూడు నెలల్లో ఆ నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
ఆ కొత్త వేదికగానే ఆయన మళ్లీ నెటిజన్ల ముందుకు రాబోతున్నారని 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు.
 
‘ట్రంప్‌ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తాను సొంతంగా పెట్టబోయే నూతన సామాజిక మాధ్యమ వేదికపైనే ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments