Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాలో మెలానియా ట్రంప్ నగ్న చిత్రాలు.. లైట్‌గా తీసుకున్న ట్రంప్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య, ప్రముఖ మోడల్ మెలానియా ట్రంప్ నగ్న చిత్రాలు అమెరికా మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, ట్రంప్ స్పందించారు. తన భార్య

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:15 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య, ప్రముఖ మోడల్ మెలానియా ట్రంప్ నగ్న చిత్రాలు అమెరికా మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, ట్రంప్ స్పందించారు. తన భార్య మెలానియా నగ్నచిత్రాలు పబ్లిష్ కావడాన్ని లైట్‌గా తీసుకున్నారు.

మెలానియా నగ్న చిత్రాలను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించడంపై ట్రంప్ ఏమాత్రం ఫైర్ కాకుండా సమాధానం ఇచ్చారు. తన భార్య ఓ విజయవంతమైన మోడల్ అని, ఇటువంటి ఫోటోలు చాలానే తీయించుకుందని చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలు తనకు పరిచయం కాకముందు దిగినవని.. యూరప్‌లో ఇలాంటి ఫోటోలు చాలా సాధారణమైనవని.. తన భార్య చాలా ఫ్యాషనబుల్ అన్నారు. 
 
ఇక ఈ ఫోటోలు తీసిన ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ బస్సేవిల్లే సైతం మీడియా ముందుకు వచ్చి, ఆమె ఎంతో ప్రొఫెషనల్‌గా నగ్న దృశ్యాలు తీయించుకుందని చెప్పడం గమనార్హం. ఆ ఫోటో షూట్‌లో ఆమె ఎలాంటి ఇబ్బందీ పడలేదని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం విశేషం. ఓ బెడ్ రూమ్‌లో మెలానియా నగ్నంగా మరో మహిళను ముద్దెట్టుకుంటున్న ఫోటోను ది ఒగిల్ ఆఫీస్ శీర్షికతో ప్రచురించింది. కానీ తన ఫొటోలను మీడియా ప్రచురించడంపై మెలానియా సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. ఇది స్త్రీల పట్ల ద్వేషంతో కూడుకొన్న చర్యని మండిపడ్డారు. పత్రిక సిగ్గుమాలిన తనానికి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. మెలానియాను అడ్డం పెట్టుకొని ట్రంప్‌ను టార్గెట్ చేసుకోవడంపై సంప్రదాయ క్రైస్తవులు తప్పుపడుతున్నారు.
 
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశపు తొలి పౌరురాలి హోదాను దక్కించుకొనే మెలానియా నగ్న చిత్రాలపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెలానియా 25 ఏళ్ల వయస్సులో మోడల్‌గా పనిచేస్తున్నపుడు దిగిన ఫోటోలు అని ట్రంప్ సలహాదారు జాసన్ మిల్లర్ పేర్కొన్నారు. మెలానియా నగ్న చిత్రాలను ఫ్రాన్స్‌కు చెందిన మ్యాక్స్ అనే పత్రిక 1995లో ప్రచురించింది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం