Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌ రసికత... బయటకు పొక్కకుండా లంచం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందు రాసలీలలు అన్నీఇన్నీకావు. అమ్మాయిలంటే పడిచచ్చే ట్రంప్‌ గతంలో ఓ పోర్న్ స్టార్‌తో శారీరక సంబంధం ఉండేదట. ఆమె పేరు స్టెఫానీ క్లిఫోర్డ్‌. అమె

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (09:41 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందు రాసలీలలు అన్నీఇన్నీకావు. అమ్మాయిలంటే పడిచచ్చే ట్రంప్‌ గతంలో ఓ పోర్న్ స్టార్‌తో శారీరక సంబంధం ఉండేదట. ఆమె పేరు స్టెఫానీ క్లిఫోర్డ్‌. అమెరికాలో పేరు ఉన్న శృంగారతార. ఆమెతో ట్రంప్ పలుమార్లు రాసలీలలు కొనసాగించినట్టు సమాచారం. 
 
కాలిఫోర్నియాలో 2006లో లేక్‌ తహో గెస్ట్‌హౌస్‌ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే! ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేదుకు డోనాల్డ్ ట్రంప్ తన ప్రేయసికి లంచం ఆశచూపారు. 
 
తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు (దాదాపు 83లక్షల రూపాయలు) ఆమెకు పంపి 'మన బంధంపై నోరెత్తవద్దు' అని కోరినట్టు సమాచారం. దీంతో స్టెఫానీ మిన్నకుండిపోయింది. అయితే, ట్రంప్ చెల్లింపుల వ్యవహారం మాత్రం లీక్ బయటకు పొక్కకుండా దాచలేక పోయారు. 
 
ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పూర్తి వివరాలను పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్‌ లాయర్‌ కోహెన్‌ సదరు పత్రికపై పరువునష్టం దావా వేశారు. పనిలో పనిగా స్టెఫానీ చేత కూడా నోటీసులిప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం