Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో అణ్వాయుధాలున్న పిచ్చోడు కిమ్‌.. వాడితో ఎపుడైనా ప్రమాదమే : డోనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్‌‌ను చూస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎపుడు.. ఎక్కడ తమపై అణ్వాయుధాలతో దాడి చేస్తాడేమోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.

Webdunia
గురువారం, 25 మే 2017 (08:57 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్‌‌ను చూస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎపుడు.. ఎక్కడ తమపై అణ్వాయుధాలతో దాడి చేస్తాడేమోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చేతిలో అణ్వాయుధాలున్న పిచ్చోడుగా కిమ్‌ను ట్రంప్ అభివర్ణించాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోతో ట్రంప్‌ గత నెలలో జరిగిన అంతరంగిక ఫోన్ సంభాషణ వివరాలను వాషింగ్టన్ పోస్ట్‌ తాజాగా బయటపెట్టింది. 
 
'కిమ్‌ మానసిక స్థితి సరిగానే ఉందా' అని ఫోన్‍లో రోడ్రిగోను ట్రంప్‌ అడిగారు. అందుకు రోడ్రిగో స్పందిస్తూ, 'కిమ్‌ అణుబాంబులను ఆటవస్తువులనుకుంటున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు. ఏదో క్షణంలో దుందుడుకు చర్యకు పాల్పడతాడని సందేహంగా ఉంది' అన్నారు. 
 
‘అణ్వాయుధాలు చేతిలో ఉన్న పిచ్చివాడిని అలా వదిలేస్తే లాభం లేదు. ఉత్తర కొరియా కంటే ఎన్నో 20 రెట్లు అధికంగా మా దగ్గర అణ్వాయుధాలున్నాయి. కానీ వాటిని మేం అడ్డగోలుగా ఉపయోగించం. కిమ్‌ ఇటీవల చేపట్టిన అణుపరీక్షలు కొన్నైనా విఫలం కావడం మంచిదే అయింది’ అని ట్రంప్‌ బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అంతా ఉత్తర కొరియా చుట్టూనే తిరిగింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments