Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు విద్యార్థులకు బహిష్కరణ భయం.. ఒకరు ఆత్మహత్య?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (10:22 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టబద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించనివారి గుండెల్లో ఆయన రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇలా అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇప్పటికే 250 మంది వరకు స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న అనేక మంది ప్రవాస భారతీయులకు బహిష్కరణ భయం పట్టుకుంది. ఇదే భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మృతుడి వివరాలు మాత్రం తెలియాల్సివుంది 
 
మృతుడి స్నేహితుడి కథనం మేరకు ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్ళాలడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి వేట మొదలుపెట్టారు. వీరిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు.
 
ఈ క్రమంలోనే సాయికుమార్ రెడ్డి పని చేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, సాయికుమార్ రెడ్డి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న్టుట తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments