Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిలో బాణాసంచా పేల్చితే ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (10:23 IST)
ఈ నెల 24వ తేదీన దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం వివిధ రకాల క్రాకర్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను ఢిల్లీ వాసులు మాత్రం ఎలాంటి శబ్దాలు చేయకుండానే జరుపుకోవాల్సివుంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా బాణాసంచా పేల్చకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమిస్తే మాత్రం రూ.200 అపరాధం లేదా ఆర్నెల్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తామని హెచ్చరించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే టపాసులు కొనుగోలు చేసినా ఈ అపరాధం విధిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, హస్తిలో వాయుకాలుష్యంతో పాటు శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా, దీపావళి సమయంలో కాల్చే మతలాబుల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీంతో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments