Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో - పాక్ నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరం : బాన్ కీ మూన్

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ నియంత్రణ రేళ వద్ద పరిస్థితులు భయంకరంగా, ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. యూరీ ఉగ్రదాడి తర్వాత ఇండోపాక్ దే

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (13:21 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ నియంత్రణ రేళ వద్ద పరిస్థితులు భయంకరంగా, ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. యూరీ ఉగ్రదాడి తర్వాత ఇండోపాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ ఇరు దేశాల వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరింత నష్టం జరగకముందే దీనిపై సామరస్యంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు.
 
'పరిస్థితి మరింత విషమించి ప్రాణనష్టానికి దారితీయకముందే భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు ముందుకు వచ్చి దీని గురించి చర్చించి శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తాయని నేను నమ్ముతున్నాను. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రయత్నించే వారి పక్షంలో ఐక్యరాజ్యసమితి నిలుస్తుంది' అని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments