Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దుపై మోడీ మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు.. అటొచ్చి.. ఇటెళ్లిన అరుణ్ జైట్లీ

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలతో పాటు.. ఆర్థిక రంగ నిపుణులు సైతం పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతో

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (12:40 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలతో పాటు.. ఆర్థిక రంగ నిపుణులు సైతం పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. పార్లమెంట్ ఉభయసభలు ఇదే అంశంపై దద్ధరిల్లి పోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. నల్లదొరలకు మరో వెసులుబాటు కల్పించడం వంటి ప్రతిపాదనలపై కేబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు తెలిసింది. సమావేశం రాత్రి 8 గంటలకు జరుగుతుందని అధికారిక సమాచారం వెలువడింది. అయితే, ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ 8.15 గంటలకు ఈ భేటీకి హాజరయ్యారు. 
 
ప్రధాని వచ్చిన ఐదు నిమిషాలకే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనూహ్యంగా కేబినెట్ సమావేశ మందిరం నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం రాత్రి 8.45 గంటలకు సమావేశం ముగిసింది. ఈ కీలక సమావేశం దేశ ఆర్థిక మంత్రి లేకుండా జరగడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments