Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది ఆయా కాదు.. సైతాన్ : ఆ కేర్‌టేకర్ పసికందులతో ఎలా కాలితో తన్నుతుందో చూడండి.. (వీడియో)

తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు తల్లికంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాల్సిన ఓ కేర్ టేకర్.. ఆ పసి పిల్లల పట్ల సైతాన్‌గా మారింది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఓ పసిపాను కాళ్ళతో తన్నుతూ ఎత్తి కింది విసిరేస్తూ

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (12:17 IST)
తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు తల్లికంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాల్సిన ఓ కేర్ టేకర్.. ఆ పసి పిల్లల పట్ల సైతాన్‌గా మారింది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఓ పసిపాను కాళ్ళతో తన్నుతూ ఎత్తి కింది విసిరేస్తూ... గొడ్డును బాదినట్టు బాదింది. ఆడుకుంటున్న పిల్లను లాగిలాగి కొట్టింది. ఆ సైతాన్ కొట్టిన దెబ్బలు తాళలేక ఆ పసిబడ్డి గుక్కపెట్టి ఏడుస్తున్నా ఏమాత్రం జాలి లేకుండా నేలకేసి కొట్టింది. అదీ కూడా తనకు అలుపు వచ్చేంత వరకు కొడుతూనే ఉంది.
 
నవీ ముంబైలోని పూర్వా ప్లేస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ ఫూటేజీలు నమోదైన ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుని పోతుంది. దీంతో పాప తల్లి ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్వా ప్లే స్కూల్ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే పాపను కేర్ టేకర్ అఫ్సానాషేక్ కొడుతూ కనిపించింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌కు పంపించారు.
 
ఈ సెంటర్ ప్రారంభించి 5 నెలలే అయ్యింది. అఫ్సానా ఉద్యోగంలో చేరి నెలే అయ్యింది. చిన్నపిల్లలందరినీ అఫ్సానా కొడుతోందని పోలీసులు గుర్తించారు. ఆమెను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

సామాజిక బాధ్యత వున్న పాత్రలంటే ఇష్టం : ఐశ్వర్య రాజేష్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రామ్ చరణ్ 10లక్షలు సాయం

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments