Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడివేడి సూప్‌లో చచ్చిన చిట్టెలుక... ఎక్కడ?

మంచి ఆకలితో రెస్టారెంట్‌కు వచ్చి కడుపునిండా ఆరగించాలని భావించిన ఆ మహిళకు... వేడివేడి సూప్‌లో కనిపించిన చిట్టెలుకను చూడగానే షాక్‌కు గురైంది. తన ఆకలి సంగతి ఏమోగానీ... ఒకింత షాక్‌కు గురైంది.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:17 IST)
మంచి ఆకలితో రెస్టారెంట్‌కు వచ్చి కడుపునిండా ఆరగించాలని భావించిన ఆ మహిళకు... వేడివేడి సూప్‌లో కనిపించిన చిట్టెలుకను చూడగానే షాక్‌కు గురైంది. తన ఆకలి సంగతి ఏమోగానీ... ఒకింత షాక్‌కు గురైంది. తనకు సర్వ్ చేసిన సూప్‌ను తాగేందుకు ప్రయత్నించగా, అందులో చచ్చిన చిట్టెలుక కనిపించింది. సూప్‌ను సర్వ్ చేసిన రెస్టారెంట్ కూడా ఎంతో ఫేమస్ రెస్టారెంట్. చైనాలోని షాన్డాంగ్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షాన్డాంగ్ ప్రాంతంలో గల ఒక ఫేమస్ రెస్టారెంట్‌కు ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో పాటు షియాబూ-షియాబూ అనే రెస్టారెంట్‌కు వచ్చారు. ఆమెకు సర్వ్ చేసిన సూప్‌లో చచ్చిన ఎలుకపిల్ల ఉందని గ్రహించడానికి ముందే ఆమె కొంత సూప్ తాగారు. ఆ తర్వాత సూప్‌లో చచ్చిన చిట్టెలుక ఉందని గ్రహించిన ఆమె హోటల్ సిబ్బందిని నిలదీసింది. 
 
ఈ పని చేయడానికి ముందు ఆమె ఆ చిట్టెలుకను వీడియో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఇది వైరల్ అయింది. ఈ ఘటన అనంతరం ఆ మహిళకు రెస్టారెంట్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే ఈ రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ రెస్టారెంట్ చైనాలో మంచి పేరున్నది కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments