Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు.. ఎలా?

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (09:54 IST)
అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు కనిపించాయి. విమాన సిబ్బంది  తనిఖీలు చేస్తుండగా ఈ మృతదేహాలు వెలుగు చూడటం కలకలం రేపింది. ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో జెట్ బ్లూకు చెందిన విమానం ల్యాండ్ గేర్‌‍లో మృతదేహాలను గుర్తించారు.
 
మృతుల వివరాలతో పాటు ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. జెట్ బ్లూకు చెందిన విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా, రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని జెట్ బ్లూ సంస్థ ధ్రువీకరించింది.
 
ఇదిలావుంటే, అమెరికాలో గడచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే రెండోసారి కావడం గమనార్హం. డిసెంబరులో షికాగో నుంచి మౌయా విమానాశ్రయానికి వచ్చిన ఓ యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్ కూడా ఓ మృతదేహం లభ్యమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments