Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల చిన్నారి.. మొసళ్ల గుంపుకు చిక్కింది.. పుర్రె మాత్రమే మిగిలింది..

Webdunia
బుధవారం, 3 జులై 2019 (16:33 IST)
కాంబోడియాలో మొసళ్ల గుంపుకు మధ్యలో రెండేళ్ల చిన్నారి చిక్కుకుంది. చివరికి మొసళ్ల నోటికి చిక్కుకున్న రెండేళ్ల చిన్నారి పుర్రె మాత్రమే మిగిలింది. ఈ ఘటన స్థానికంగా ప్రజలను భయభ్రాంతులను చేసింది. వివరాల్లోకి వెళితే.. కాంబోడియాలో సియమ్ రియాయ్ అనే ప్రాంతంలో మొసళ్ల ఫామ్ వుంది. ఈ మొసళ్ల ఫామ్‌ను 35 ఏళ్ల మిన్ మిన్ నిర్వహిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మొసళ్లను మాత్రమే వదిలిపెట్టి.. ఫామ్‌కు సంబంధించిన పనుల కోసం బయటికి వెళ్లాడు. మిన్ మిన్‌ తొలి సంతానం రెండేళ్ల చిన్నారి రోమ్ రాథ్ బయట ఆడుకుంటూ వున్నది. ఆతని భార్య అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆ పాపాయిని చూస్తూ.. ఆడుకుంటూ వున్న తొలి బిడ్డను పెద్దగా పట్టించుకోలేదు. 
 
కానీ రోమ్ రాథ్ కాలు జారి మొసళ్ల ఫామ్‌లో పడటంతో మొసళ్లు ఆ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. చివరికి రోమ్ రాథ్‌ను వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రికి.. మొసళ్ల బృందంలో రోమ్ రాథ్ పుర్రె మాత్రం కనిపించింది. దీంతో షాక్ తిన్న మిన్ మిన్ బోరున విలపించాడు. ఇంట్లోనే ఆడుకుంటూ వుంది కదానుకున్న రోమ్ రాథ్ తల్లి మొసళ్లు తన బిడ్డను పొట్టను బెట్టుకున్న విషయం తెలుసుకుని రోదించింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments