కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రేసులో వారిద్దరే ముందు! (Video)

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (09:26 IST)
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీని అభివృద్ధి, సామర్థ్యంలో ఆస్ట్రాజెనికా అందరికన్నా ముందంజలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 
 
మోడెర్నా వ్యాక్సిన్‌ సైతం ఆస్ట్రాజెనికా కన్నా మరీ వెనకేంలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా 15 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

సినోవాక్‌ సహా చైనాకు చెందిన బహుళ సంస్థలతో సూదిమందు అభివృద్ధి గురించి డబ్ల్యూహెచ్‌వో మాట్లాడిందని వెల్లడించారు. సంస్థలో కొన్ని డ్రగ్స్‌కు జరుగుతున్న సంఘీభావ ట్రయల్స్‌ మాదిరిగానే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఆమె పిలుపునిచ్చారు.
 
కొవిడ్‌-19 సూదిమందు ఏడాదిలోపు వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెయేసుస్‌ ఐరోపా పార్లమెంటు కమిటీ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి స్పందన విషయంలో తమవైపు నుంచి తప్పులు జరిగినట్టు ఆయన అంగీకరించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments