Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్-19 – వైద్య సహాయం ఎప్పుడు పొందాలి?

కోవిడ్-19 – వైద్య సహాయం ఎప్పుడు పొందాలి?
, మంగళవారం, 23 జూన్ 2020 (08:27 IST)
కోవిడ్-19 అనుమానితులు/సంరక్షకులు/బాధితులకు సేవలు అందించేవారు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు, తీవ్రమైన లేక కొత్త లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే వైద్యుల సాయం పొందాలి. 
 
ఈ క్రింద ఇవ్వబడిన లక్షణాలు గమనించినట్టయితే వెంటనే స్థానికంగా ఉండే వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు లేదా వైద్యులకు సమాచారం ఇవ్వాలి. 
 
1) దగ్గు, గొంతునొప్పి
2) పెదాలు/ముఖం నీలం రంగులోకి మారుట
3) విపరీతమైన జ్వరం
4) ఛాతిలో నొప్పి లేదా నొక్కినట్టు ఉండడం
5) శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు
6) రుచి, వాసన తెలుసుకునే సామర్థ్యం తగ్గడం  
 
కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలు అందించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1) మాస్క్ ఉపయోగించే విధానం: అనారోగ్యంగా ఉన్న వ్యక్తి గదిలోనే ఉంటునట్లయితే మూడు పొరల మెడికల్ మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి.. 
 
సాధ్యమైనంత వరకు మాస్క్ ముందు భాగాన్ని తాకకూడదు లేదా పైకి క్రిందికి కదపరాదు. నోటి నుంచి వచ్చే తుంపర్లు, ముక్కు నుంచి కారే నీటితో మాస్క్ తడిగా మారినపుడు లేదా మురికిగా అయితే వెంటనే మాస్కును మార్చవలెను. 
 
ఒకసారి ఉపయోగించిన మాస్కును మళ్లీ వాడరాదు. దాన్ని తీసివేసినపుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మూతగల చెత్త డబ్బాలో మాస్కును జాగ్రత్తగా పారవేయాలి. చెత్త బుట్టలో వేసిన మాస్కులన్నింటిని రోజులో ఒకసారి ఇంటి బయట కాల్చి వేయవలెను. 

1) ఒక మాస్క్ ఆరు గంటలకు మించి వాడండి:
2) కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలందించే ఆరోగ్య సిబ్బంది, వైద్యులు వారి దగ్గర ఉన్నప్పుడు మీ ముక్కు, నోరు, కళ్ళను తాకకుండా ఉండాలి.
 
3) కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలు అందించడానికి వెళ్ళే ముందు మరియు అందించిన తర్వాత తప్పక చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్ల పాటు కడుక్కోవాలి. శానిటైజర్ ను అప్లై చేయాలి.
 
4) ఆహారం వండడానికి ముందు మరియు తరువాత, తినడానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత, చేతులు మురికిగా అనిపించినపుడు సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవాలి. ఆ తర్వాత చేతులు పైకెత్తి గాలికి ఆరబెట్టాలి.
 
5) కోవిడ్-19 చికిత్స కోసం వచ్చే వారి శరీరం నుంచి వచ్చే చెమట, నోటి నుంచి వచ్చే ఉమ్మి, ముక్కు నుంచి కారే నీరు వీటన్నింటిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో కోవిడ్-19 వైరస్ ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తాకవలసి వస్తే వెంటనే చేతులు సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవలెను. కడుక్కొన్న తరువాత చేతులు పైకెత్తి గాలికి ఆరబెట్టండి.
 
6) కోవిడ్-19 బాధితుడు ఉన్న గదిలో ఏ వస్తువును ముట్టుకోకండి
 
7) పేషెంట్ వాడే వస్తువులయిన బెడ్ షీట్స్, టవల్స్, ప్లేట్, గిన్నెలు, గ్లాసులను గుర్తించి వాటిని ప్రత్యేకంగా ఉంచండి. వీటిని మిగిలిన సామాన్లు/వస్తువులతో కలపకండి. వీటిని ముట్టుకున్న వెంటనే చేతులు కడుక్కోవాలి.
 
8) ఒకవేళ పేషెంట్ వాడిన వస్తువులు ఏవైనా తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి తిరిగి ఉపయోగించవచ్చు. 
 
9) పేషెంట్ కు ఆహారం మరియు ఇతర అవసరాలను వారు ఉంటున్న గదిలోనే అందించండి.
 
10) ఉపరితలాలను తాకవలసి వచ్చినపుడు లేదా శుభ్రపరిచినపుడు మరియు పేషెంట్ ఉపయోగించిన బట్టలు, దుప్పట్లు ఉతికినపుడు మూడుపొరల మాస్క్ (త్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్) వాడాలి.
 
11) వైద్యులు ఇచ్చిన మందులు అన్నింటినీ సూచించిన సమయానికి రోగికి ఇచ్చి వేసుకునేటట్లు చూడండి.
 
12) పేషెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజూ శరీర ఉష్ణోగ్రత (జ్వరం) తెలుసుకుంటూ ఉండాలి. పేషెంట్ లో వ్యాధి లక్షణాలయిన జ్వరము, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిలబడలేనంత బలహీనత, ఛాతిలో నొప్పి ఎక్కువయినట్టు అనిపిస్తే వెంటనే మీ పైస్థాయిలో ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
 
జాగ్రత్తగా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో!  అజాగ్రత్తగా ఉంటే ఐసీయూలో ఐసోలేషన్ లో!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్, రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు, టెన్షన్లో సహచర సభ్యులు