Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమ్‌డిసివిర్ ఔషధం మొత్తం కొనుగోలు చేసిన అమెరికా

Webdunia
బుధవారం, 1 జులై 2020 (15:45 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేక పోయింది. అయితే, కరోనా వైరస్‌పై కొంతమేరకు ప్రభావితం చూపుతున్న మందుల్లో రెమ్‌డిసివిర్ ఒకటి. అందుకే అగ్రరాజ్యం అమెరికా ఈ ఔషధం మొత్తాన్ని కొనుగోలు చేసింది. 
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి అవుతున్న ఈ ఔష‌ధాల‌ను మొత్తం ఆ దేశ‌మే కొనేసింది. ఈ మేరకు రెమ్‌డిసివిర్‌తో అమెరికా అసాధార‌ణ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అయ్యే ఆ ఔష‌ధాల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం డీల్ కుదుర్చుకున్న‌ది. 
 
రెమ్‌డిసివిర్ మందును గిలీడ్ సైన్సెస్ సంస్థ తయారు చేస్తోంది. ఈ ఔష‌ధం వాడిన వారు చాలా వేగంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌ట్లు తేలింది. దీంతో ఈ ఔషధాన్ని ఆమెరికా కొనుగోలు చేసింది. ఈ మేరుక యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ శాఖ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. 
 
రెమ్‌డిసివిర్‌ను ఉత్ప‌త్తి చేసే గిలీడ్ సంస్థ‌తో ట్రంప్ స‌ర్కార్ అద్భుత‌మైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు పేర్కొన్న‌ది. జూలైలో జ‌రిగే వంద శాతం ఉత్ప‌త్తిని అంటే సుమారు 5 ల‌క్ష‌ల డోస్‌లతో పాటు ఆగ‌స్టులో 90 శాతం, సెప్టెంబ‌ర్‌లో 90 ఔష‌ధ స‌ర‌ఫ‌రాను కూడా త‌మ‌కే ఇవ్వాల‌ని ట్రంప్ స‌ర్కార్ గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments