Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లోబల్ ఎమెర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ-213కి చేరిన కరోనా మృతులు

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (12:23 IST)
చైనాను వణికించిన కరోనా ప్రస్తుతం భారత్‌లోకి ప్రవేశించింది. కేరళ రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. మలేషియాలో కరోనాతో ఓ భారతీయుడు మృతి చెందాడు. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అటు ఢిల్లీలోనూ పలువురికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది.

పలు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో అనుమానితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో చైనా నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికీ టెస్ట్‌లు జరిపి.. వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మహమ్మారితో భారత్‌లోకి ప్రవేశించడం.. కేరళలో మొదటి కేసు నమోదు కావడంతో... అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
 
మరోవైపు కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్‌ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా చైనాలో రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.

కరోనా వైరస్ మృతుల సంఖ్య ఇప్పటివరకు 213కి చేరింది. చైనాలో 9,300 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే 19 దేశాలకు విస్తరించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ప్రపంచ దేశాలు బయో సెక్యూరిటీ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments