చైనాలో మళ్లీ కరోనా... అదే వూహాన్‌లో 11 కేసులు.. లాక్‌డౌన్

Webdunia
సోమవారం, 11 మే 2020 (09:45 IST)
కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరంలో మళ్లీ కోవిడ్-19 కేసులు నమోదైనాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే చైనాలో 17 కేసులు నమోదైనాయి. దీంట్లో అయిదు కేసులు వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్ నగరంలోనే చోటుచేసుకున్నాయి. 
 
చైనాలోని ఈశాన్యంలో ఉన్న జిలిన్ ప్రావిన్సులోని షూలన్ నగరంలో కొత్తగా ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఆ నగరాన్ని లాక్ డౌన్ చేశారు. ఈ కేసులన్నీ ఓ దోబీ మహిళకు లింకై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దోబీ వృత్తి చేపట్టే 45 ఏళ్ల మహిళ మొదట తన భర్తకు, సోదరులకు, ఆ తర్వాత ఫ్యామిలీ సభ్యులందరికీ వైరస్‌ను అంటించింది. వాస్తవానికి ఆమెకు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు.
 
వైరస్ కేసులు బయటపడడంతో షూలన్ నగరంలో ఉన్న అన్ని పబ్లిక్ స్థలాలను మూసివేశారు. నగరవాసులందర్నీ ఇంటికే పరిమితం కావాలంటూ ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలిపేశారు. ఆ నగరాన్ని హైరిస్క్ ప్రాంతంగా ప్రకటించారు. దోబీ వృత్తి చేసే మహిళకు వైరస్ సోకడంతో.. చైనాలోని సోషల్ మీడియాలో ఇదే చర్చాంశమైంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments