Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసూతి వార్డులోకి అనుమతించలేదనీ... వైద్యుడి చెవి కొరికేశాడు...

Webdunia
సోమవారం, 11 మే 2020 (09:01 IST)
తన భార్య ఉన్న ప్రసూతి వార్డులోకి అనుమతించలేదన్న కోపంతో ఓ వ్యక్తి వైద్యుడి చెవి కొరికేశాడు. ఈ దారుణ ఘటన ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో ఆస్పత్రిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బరంపురంలో మహారాజా కృష్ణచంద్ర గజపతి వైద్య కళాశాల ఆసుపత్రి ఉంది. గంజాం జిల్లాకు చెందిన పురుషోత్తంపూర్‌కు చెందిన తరిణి ప్రసాద్ మహాపాత్రో కాన్పు కోసం తన భార్యను ఆసుపత్రిలో చేర్చాడు. ఆ మహిళ వెంట అప్పటికే ఐదుగురు సహాయకులు ఉన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తరణి కూడా ప్రసూతి వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పైగా, అది ప్రసూతి వార్డు కావడంతో పురుషులను అనుమతించేది లేదని వైద్య సిబ్బంది తేల్చి చెప్పారు. 
 
అయితే, తన భార్య వద్దకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. కానీ వైద్య సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆగ్రహంతో చిందులేసిన తరిణి ప్రసాద్ తనను అడ్డుకున్న వైద్యుడు స్మృతి రంజన్‌పై దాడిచేశాడు. అప్రమత్తమైన మిగతా వైద్యులు అతడిని అడ్డుకున్నారు. 
 
దీంతో మరింత రెచ్చిపోయిన తరిణి, పీజీ వైద్య విద్యార్థి షకీల్ ఖాన్ ఎడమ చెవిని బలంగా కొరికేశాడు. మిగతా వైద్యులపైనా దాడిచేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తరిణి ప్రసాద్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments