Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (17:39 IST)
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్ ప్రాంతంలో అన్నెం శృతి అనే యువతి చిక్కుకునిపోయింది. ఈ యువతి కర్నూలు జిల్లాకు చెందిన యువతి కావడం గమనార్హం. ఈ యువతి టీసీఎల్ కంపెనీలో పనిచేస్తూ వస్తోంది. శిక్షణ నిమిత్తం గత ఏడాది ఆగస్టులో తిరుపతి నుంచి 60 మంది ఉద్యోగులతో కలసి చైనా వెళ్లింది. 
 
అయితే, చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ ఉన్న భారతీయులందరినీ కేంద్రం స్వదేశానికి రప్పిస్తోంది. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాలు నడిపింది. అయితే, అన్నెం శృతిని మాత్రం విమానం ఎక్కనివ్వలేదు. దీనికి కారణం ఆ యువతినికి 90 డిగ్రీల జ్వరం ఉండటంతో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా దించేశారు. 
 
తనతో పాటు మిగిలిన ఇద్దరు చెరో చోట చిక్కుకుని ఉండిపోయామని.. తిండి మందులు ఏమి ఇవ్వడం లేదని కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం  బీజనవేములలో ఉంటున్న తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో ద్వారా సమాచారం చేరవేసింది. 
 
శృతికి ఈనెల 14న మహానంది మండలం తమ్మడపల్లెకు చెందిన యువకునితో వివాహంనిశ్చయం అయింది. 
పెళ్లి దగ్గర పడుతున్న తరుణంలో శృతి చైనాలో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తెను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments