Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడే పుట్టిన బిడ్డ గర్భవతి.. షాకైన వైద్యులు... ఎక్కడ... ఎలా?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (21:13 IST)
వైద్యశాస్త్రపరంగా ప్రపంచ దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. కానీ, పరిశోధనలకు కూడా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు సృష్టిలో దాగివున్నాయని నిరూపించే సంఘటన ఇది. ముఖ్యంగా మనిషి ఊహాకు కూడా అందని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
సాధారణంగా తల్లి కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం చూశాం. ఒకే కాన్పులో గంపెడు కవలలు పుట్టారని కూడా విన్నాం. కవల పిల్లలు అతుక్కుని పుట్టిన సందర్భాలు అనేకం. కానీ, పిండంలో పిండం ఉండటం ఎప్పుడైనా చూశారా? పోనూ విన్నారా? అంతేకాదు అప్పుడే పుట్టిన ఆడ శిశువు గర్భం దాల్చడం సాధ్యమేనా? సృష్టికి ప్రతిసృష్టి. వింతల్లో వింతగా చెప్పుకోవాలి. 
 
కొలంబియాకు చెందిన మోనికా వేగా అనే మహిళ గర్భం దాల్చి ఆడ శిశువుకు జన్మించింది. ప్రసవం సమయంలో మహిళ గర్భాశయంలో పిండంలో పిండం ఉందని వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి బయటకు తీశాక.. ఆడ కవలలుగా తేల్చారు. అయితే, పుట్టిన ఒక ఆడ శిశువు కడుపులో మరో ఆడ శిశువు పిండం ఉండటం చూసి వైద్యులు షాకయ్యారు. 
 
నిజానికి వేగాను పరీక్షించినప్పుడు 35 వారాల గర్భవతిగా వైద్యులు చెప్పారు. ఇంకా ఐదు వారాలైతే శిశువు జన్మిస్తుంది. ఇదేసమయంలో వైద్యులు మహిళ వేగాకు కలర్ డాప్లర్, త్రిడీ 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. తొలుత శిశువు కడుపులో ఉన్నది ఏదో తిత్తి అయి ఉంటుందని వైద్యులు భావించారు. శిశువు బొడ్డుతాడుకు అది అత్కుకుని ఉన్నట్టు గుర్తించారు. ఇదేవిషయాన్ని తల్లి వేగాకు వైద్యులు చెబితే ఆమె అసాధ్యం అంటూ కొట్టిపారేసింది. తర్వాత పరీక్షించిన వైద్యులు ఆమెకు మెల్లగా వివరించారు.
 
ఈ ఘటనకు సంబంధించి స్థానిక మీడియాలో జోరుగా వార్తలు వ్యాపించాయి. వేగా అనే 33 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒక శిశువు ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. శిశువు కడుపులో ఉన్న అసంపూర్తిగా ఉన్న పిండాన్ని వైద్యులు తొలగించేందుకు సర్జరీ చేసినట్టు తెలిపారు. గర్భం దాల్చిన పిండం 37 వారాలు కాగా.. బరువు 7 పౌండ్లు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం