పాకిస్థాన్ మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. కాలేజీకి వెళ్లిన ఓ యువతిని ముగ్గురు కామాంధులు బలంవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన కరాచీ నగరంలో గుల్షన్ ఏ హదీద్ ప్రాంతంలో వెలుగుచూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, గుల్షన్ ఏ హదీద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కళాశాలకు వెళ్లింది. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ విచారణలో ఆ యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు తెలుసుకుని, ఆ యువతి ఆచూకీ కూడా కనుగొన్నారు. ఆ తర్వాత బాధితురాలిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు అనుమానితులను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలావుంటే, 2020 నివేదిక ప్రకారం పాకిస్థాన్‌లో ప్రతిరోజూ 11 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్టు సమాచారం. గత ఆరేళ్లలో 22,000 అత్యాచారం కేసులు నమోదు కాగా ఇందులో కేవలం 0.03 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. 2015లో 22,037 లైంగిక వేధింపుల కేసులు నమోదు కాగా కేవలం 4,060 కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి.