Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం

డీవీ
బుధవారం, 1 మే 2024 (18:07 IST)
Chinnari Kalash Honorary Doctorate, london
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ...   వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము....    అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
 
అది ఆగస్టు 13, 2013... తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ... కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు... ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ  ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.
 
‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.
 
బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశం అని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments