Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శర్వానంద్... మనమే నుండి యువత కోసం లండన్‌ లో చిత్రికరించిన సాంగ్ విడుదల

Advertiesment
Sharwanand

డీవీ

, గురువారం, 28 మార్చి 2024 (16:16 IST)
Sharwanand
హీరో శర్వానంద్ 35వ చిత్రం 'మనమే'. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. టైటిల్ గ్లింప్స్ కూడా చాలా ప్లజంట్ గా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్
 
మేకర్స్ ఫస్ట్ సింగిల్- ఇక నా మాటను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ రీసెంట్ ఆల్బమ్‌లు ఖుషి, హాయ్ నాన్న బ్లాక్‌బస్టర్‌లుగా కావడంతో టాప్ ఫామ్‌ లో వున్న్నారు.  హేషమ్ ట్యూన్ స్కోర్ చేయడంతో పాటు, ఈ ఫుట్ ట్యాపింగ్ పాటకు వోకల్స్ కూడా అందించారు.
 
ఈ పాటలో ఉపయోగించిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ నేచర్ ఎలక్ట్రానిక్. ఇది ఖచ్చితంగా కాలేజ్ కి వెళ్లే యువతలో, ప్రత్యేకంగా సింగిల్స్‌ ను అలరించబోతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం సింగిల్ గా ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ వినగానే ఆకట్టుకునే పాటని అందించారు, అతని వాయిస్ మరింత ఫన్ ని యాడ్ చేసింది  
 
లండన్‌లోని అద్భుతమైన లొకేషన్‌లను విష్ణు శర్మ,  జ్ఞాన శేఖర్ VS లావిష్ గా చిత్రీకరించారు. శర్వానంద్ గ్రేస్ ఫుల్,  స్టైలిష్ మూవ్‌లు చూడటానికి ట్రీట్‌గా ఉంటాయి. ముఖ్యంగా, హుక్ స్టెప్ యువతని విశేషంగా ఆకట్టుకుంది. శ్రాస్తి వర్మ కొరియోగ్రఫీ చేశారు. శర్వా డ్రెస్సింగ్, స్టైలింగ్ ట్రెండీగా ఉన్నాయి. తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తూ, హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇన్స్టంట్  కనెక్ట్ అయ్యే యంగ్ నెంబర్ ని అందించాడు.  శ్రీరామ్ ఆదిత్యకు సంగీతంలో మంచి అభిరుచి ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి ఇక నా మాటే సరైన పాట. శర్వానంద్‌ను మునుపెన్నడూ లేని స్టైలిష్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు దర్శకుడు. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ కోసం జక్కన్నలా మారిన కనకరాజ్