Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీస్ పార్టీలో 10 నిమిషాల్లో లీటర్ మద్యం తాగిన ఉద్యోగి.. తర్వాత ఏమైంది...

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (17:05 IST)
తాను పని చేసే కార్యాలయంలో జరిగిన పార్టీ సహచరులతో పందెం కాసి కేవలం పది నిమిషాల్లో లీటర్ మద్యాన్ని సేవించాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన చైనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన  తెచ్చాడు. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాసాడు. ఒక లీటర్ మద్యాన్ని 10 నిమిషాల్లో తాగిన వారికి రూ.5 వేల యువాన్‌లు భారత కరెన్సీలో రూ.58 వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. దీనికి ఎవరూ స్పందించలేదు. దీంతో బాస్.. బహుమతి మొత్తాన్ని రూ.10 వేల యూవాన్‌లకు పెంచినప్పటికీ ఉద్యోగుల నుంచి  స్పందన రాలేదు. 
 
చివరకు రూ.20 వేల యువాన్‌లు ప్రకటించడంతో ఝాంగీ అనే ఉద్యోగి ఈ పందెంకు అంగీకరించాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసిన గటగటామని 10 నిమిషాల్లో తాగేశాడు. మద్యాన్ని పూర్తిగా సేవించిన తర్వాత ఝాంగా స్మృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యూమోనియా, ఉపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ వంటి కారణాలతో అతను మరణించివుంటాడని వైద్యులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments