Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది అతిపెద్ద సైన్యం.. ఎవరినైనా ఓడించితీరుతాం : చైనా అధ్యక్షుడు

భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షడు క్సీ జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమని, ఏ దేశాన్నైనా ఓడించి తీరుతామని ఆయన హెచ్చరించారు. సిక్కిం భూభాగంలోని డోక్లాం వద్ద గ

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (11:42 IST)
భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షడు క్సీ జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమని, ఏ దేశాన్నైనా ఓడించి తీరుతామని ఆయన హెచ్చరించారు. సిక్కిం భూభాగంలోని డోక్లాం వద్ద గత నెల రోజులుగా భారత్ - చైనా బలగాలు మొహరించి ఉన్నాయి. ఈ సమస్య పరిష్కార దిశగా ఇరు దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. జిన్ పింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 
 
తమ దేశ సరిహద్దుల్లో చొచ్చుకువచ్చే పొరుగు దేశాల సైన్యం సహా, తమ సార్వభౌమత్వానికి ఎదురు నిలిచే శత్రువులందరినీ ఓడించే సత్తా తమకుందన్నారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ అని, తమ జవాన్లకు ఎవరినైనా ఓడించగలమన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదని తెలిపారు.
 
కాగా, భారత్, చైనా సరిహద్దుల్లోని సిక్కిం సెక్టారులోని డోక్లాం సమీపంలో ఇండియా - చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గడచిన నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఇరు వైపులా సైన్యాలు మోహరించి వుండగా, సమస్య పరిష్కారం దిశగా ఇంతవరకూ ఎటువంటి చర్చలూ మొదలు కాలేదన్న సంగతి తెలిసిందే. తమ సత్తాను పరిచయం చేస్తూ, ఇటీవల చైనా సైన్యం పలు రకాల లైవ్ డ్రిల్స్ కూడా ఈ ప్రాంతంలో చేపట్టింది. ప్రతిగా భారత సైన్యం కూడా విన్యాసాలు చేపట్టింది. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం