Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.వెయ్యికే 4జి ఫోన్?... జియోకు షాక్...

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది. రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో 4జి ఫీచర్‌ ఫోన్ల పోరు మొద

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (10:02 IST)
టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది. రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో 4జి ఫీచర్‌ ఫోన్ల పోరు మొదలైంది. 
 
ఇటీవల ఉచితంగా రిలయన్స్‌ జియో 4జి ఫీచర్‌ ఫోన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా సరికొత్త ఫీచర్‌ ఫోన్‌ తీసుకొస్తున్నట్టు సమాచారం. 
 
జియో ఫోన్‌ ధర రూ.1,500 ఉండగా ఎయిర్‌టెల్‌ తన 4జి ఫోన్‌ని రూ.1000లకే అందించబోతోందని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే రిలయన్స్‌ జియో మాదిరిగా ఎయిర్‌టెల్‌ కూడా మూడేళ్ల తర్వాత ఈ ఫోన్‌ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
 
దాదాపు 50 కోట్ల వరకు ఉన్న ఫీచర్‌ మొబైల్‌ ఫోన్ల వినియోగదారులను 4జి సేవలవైపు మళ్లించేందుకు జియో ఈ ప్రయోగానికి తెరతీసింది. దీంతో జియో పోటీని ఎదుర్కోవాలంటే తామూ అదే వ్యూహంతో వెళ్లక తప్పదని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments