Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో బర్డ్ ఫ్లూ కలకలం : నాలుగేళ్ల చిన్నారికి సోకింది..

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (10:18 IST)
కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు చైనా తల్లడిల్లిపోతోంది. అనేక ప్రాంతాల్లో లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. మరోవైపు, షాంఘై వంటి ముఖ్య నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇపుడు బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. బర్డ్‌ఫ్లూకు చెందిన హెచ్3ఎన్8 రకం లక్షణాలను చైనీయుల్లో గుర్తించారు. అలా వైరస్ మానవులకు సంక్రమించడం చైనా దేశంలో ఇదే తొలిసారి కావడం. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 
 
ముఖ్యంగా, దేశంలోని హెనాన్ ప్రావిన్స్‌‌లో నాలుగేళ్ల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఆ బాలుడు జ్వరంతో పాటు ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడని పేర్కొంది. అయితే, ఆ బాధిత బాలుడు కుటుంబ సభ్యుల్లో ఈ జ్వరం సోకలేదని వెల్లడించింది. 
 
బాధితుని ఇంట్లో పెంపుడు కుక్కలు, కాకులు, కోళ్లు ఉన్నాయని వాటి వల్లే హెచ్3ఎన్8 వేరియంట్ సోకివుండొచ్చని ఎన్.హెచ్.సి అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ప్రాంతంలోనూ గుర్రాలు, కుక్కలు, పక్షులు, సీల్స్‌లలో హెచ్3ఎన్8 వేరియంట్‌ను గుర్తించలేదని చైనా హెల్త్ మిషన్ తెలిపింది 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments