Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై ప్రశంసలు కురిపించిన చైనా.. దాయాదీ దేశం త్యాగాలు చేసిందట..

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (14:36 IST)
ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఉగ్రవాదం అనేది 'కామన్ ఛాలెంజ్' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రకటించారు. ప్రపంచంలోని దేశాలన్నింటికీ ఉగ్రవాదమే ఉమ్మడి శత్రువు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ఎన్నో ప్రయత్నాలు, త్యాగాలు చేసిందని చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఆ ప్రయత్నాలను గుర్తించి, గౌరవించాలి. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందంటూ జావో లిజియన్ తెలిపారు. 
 
తద్వారా చైనా కళ్లున్న కబోది అని నిరూపించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్‌ను ఇబ్బందులు పెట్టడానికి చైనా ఈ మధ్య పాకిస్తాన్ కు జై కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్‌కు అండగా నిలబడింది. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చైనా కితాబునిస్తోంది.
 
ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పాకిస్థాన్ భద్రతా బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించాయి. శుక్రవారం మన్‌కోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాక్ సైనికులు కాల్పులకు తెగబడినట్టు ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూంచ్ జిల్లా మన్‌కోట్ సెక్టార్‌లోని ఎల్వోసీ పొడవునా పాకిస్తాన్ సైన్యం తేలికపాటి ఆయుధాలు, మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూ కాల్పులకు దిగింది. భారత సైనికులు పాక్ సైనికులకు ధీటుగా సమాధానం చెప్తున్నారని ఆర్మీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments