Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సరిహద్దు తలనొప్పి : రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచిన చైనా

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (13:11 IST)
ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. చైనా బలగాలు హద్దుమీరుతుంటే.. వాటిని భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా తన రక్షణ బడ్జెట్​ను భారీగా పెంచింది. ఈ ఏడాది 209 బిలియన్​ డాలర్లు రక్షణ శాఖకు కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం ఎక్కువ. 
 
రక్షణ బడ్జెట్​ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా‌.. ఈ సంవత్సరం రక్షణ రంగానికి 209 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు నేషనల్​ పీపుల్స్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​పీసీ) పార్లమెంట్​లో ప్రకటించింది. ఇది భారత రక్షణ బడ్జెట్‌కు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. 
 
ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం అధికంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టడానికి కాదని.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికేనని చైనా స్పష్టం చేసింది. శాంతియుత అభివృద్ధి, భద్రతా విధానాలకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపింది .ఒక దేశం ఇతరులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనేది.. ఆ దేశ రక్షణ విధానంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments