Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉ.కొరియా అంటే డ్రాగన్‌కు భయం: భారత్‌లో రహదారులు మురికి కూపాలు: చైనా ఎద్దేవా

ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా అంటేనే దక్షిణ కొరియా, జపాన్‌తో పాటు చైనా సైతం జడుసుకుంటోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియాపై జపాన్, దక

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (17:26 IST)
ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా అంటేనే దక్షిణ కొరియా, జపాన్‌తో పాటు చైనా సైతం జడుసుకుంటోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియాపై జపాన్, దక్షిణ కొరియా, చైనా ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా భయపడుతున్నారని చైనా అధికా టీషేంగువా అన్నారు. ఉత్తర కొరియా పేరు వింటేనే తమ ప్రజలు జడుసుకుంటున్నారని టీషేంగువా వెల్లడించారు. 
 
ఉత్తర కొరియాతో స్నేహం కోరుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నప్పటికీ.. ఆ దేశం చేస్తున్న అణు, క్షిపణి ప్రయోగాలతో విదేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నట్లు ఆయన  పేర్కొన్నారు. కత్తి పట్టుకున్న ఉన్మాది ఎప్పటికైనా పొరుగువారిని గాయపరచకుండా ఊరుకోడని టీషేంగువా తెలిపారు. ఉత్తరకొరియా ఉన్మాదంతో ముందుకు సాగుతోందని.. అది జపాన్, దక్షిణ కొరియాతో పాటు చైనాకు కూడా ప్రమోదమేనని ఆయన వ్యాఖ్యానించారు.
 
మరోవైపు భారత్-జపాన్ సంబంధాలపై కూడా చైనా స్పందించింది. చైనా శత్రుదేశమైన జపాన్ భారత్‌ను మాయ చేస్తుందని చైనా అభిప్రాయం వ్యక్తం చేసింది.  జపాన్ అమెరికాను ప్రత్యక్ష్యంగా ఎదుర్కోలేక భారత్‌ను పావుగా వాడుకుంటుందని చైనా వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి మోదీ, అబేలు ప్రస్తావించిన ఆసియా-ఆఫ్రికా గ్రోత్‌ కారిడార్‌ కాన్సెప్ట్‌ చైనాకు చెందిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు నుంచి తీసుకున్నదేనని చైనా మీడియా తేల్చేసింది. 
 
భారత్‌లో ఎన్ని ఎక్స్‌ప్రెస్‌వేలను, బుల్లెట్‌ ట్రైన్లను నిర్మించినా అక్క‌డి ర‌హ‌దారులు మురికి కూపాలను పోలి ఉంటాయని చైనా ఎద్దేవా చేసింది. జపాన్‌, భారత్‌లు వారి దేశాల అవసరాల ఆధారంగా సంబంధాలు మెరుగుపర్చుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని హితవు పలికింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments