Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షీణించిన భారత్ - చైనా స్నేహం... ఏ క్షణమైనా యుద్ధం : ఫారిన్ మీడియా

భారత్, చైనా దేశాల మధ్య స్నేహసంబంధాలు గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిపోయాయని, అందువల్ల ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా అభిప్రాయపడుతోంది.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (14:06 IST)
భారత్, చైనా దేశాల మధ్య స్నేహసంబంధాలు గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిపోయాయని, అందువల్ల ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా అభిప్రాయపడుతోంది. 
 
సిక్కిం రాష్ట్రంలోని డోక్లామ్ రీజియన్‌ వద్ద భారత భూభాగంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టగా, ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై విదేశీ మీడియా 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఇండియా, చైనాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ రెండు దేశాల మధ్యా ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. గడచిన రెండు నెలలుగా హిమాలయాల ప్రాంతంలోని డోక్లామ్ రీజియన్ లో ఇరు దేశాలూ సైన్యాన్ని మోహరించాయని, ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసేందుకు ఇప్పటివరకూ చర్చలు ప్రారంభం కాలేదని, సమస్యకు కారణం మీరంటే మీరని రెండు దేశాలూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నాయని 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఈ ప్రాంతం తమదంటే, తమదని రెండు దేశాలూ వాదిస్తున్న విషయాన్నీ ప్రస్తావించింది. వెనక్కు తగ్గేందుకు ఏ దేశమూ సుముఖంగా లేదని, ఏక్షణమైనా సైనికుల మధ్య కాల్పులతో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భారత్, చైనాల మధ్య స్నేహబంధం, గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు 'ది వాషింగ్టన్ పోస్టు' పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments