జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసిన పవన్.. పాకిస్థాన్‌ను ఏకిపారేశారు..
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ పాకిస్థాన్‌ను ఏకిపారేశారు. తాను చిన్న
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ పాకిస్థాన్‌ను ఏకిపారేశారు. తాను చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు చదివానని.. వారు చేసిన త్యాగాలు, పోరాటాలతో స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చారు. నిజానికి ప్రతి ఒక్కరూ మన దేశ చరిత్ర చదవాలన్నారు.
మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేద్కర్, భగత్ సింగ్ వంటి అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రను తెలుసుకోవాలి. ఇలాంటి మహనీయులు పుట్టిన దేశంలో మనం జన్మించడం అదృష్టమని చెప్పుకొచ్చారు. మనమంతా ఒకే దేశంలో ఉన్నామనే విషయాన్ని ప్రజలు భావించట్లేదని.. రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తేడా వుండకూడదని.. మనమంతా భారతీయులమనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
దేశం ఉండటం ఎంత అవసరమో.. దేశమే లేని ప్రజల బాధేంటో పాలస్తీనా పౌరుల్ని అడిగితే తెలుస్తుందని పవన్ అన్నారు. దేశానికి విలువ, గౌరవం ఇవ్వాలని ఎంతమందికి తెలుసని పవన్ ప్రశ్నించారు. పాలస్తీనా వెళ్లినప్పుడు వాళ్లకు దేశం కావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్లకు దేశమే లేదని చెప్పారు.
భారతదేశం నుంచి పాకిస్థాన్ దేశంగా ఏర్పడినప్పుడు ఎన్ని లక్షల మంది నరకబడ్డారు? ఎన్ని లక్షల మంది మహిళలు మానభంగాలు చేయబడ్డారు.. అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెతరుక్కుపోతుందని అన్నారు. మన దేశం గొప్పది అని ఎందుకంటున్నానంటే.. పాకిస్థాన్ దేశంలో ఒక హిందూ ప్రధానిని గానీ, రాష్ట్రపతిని గానీ చూడలేమని పవన్ చెప్పుకొచ్చారు.
అయితే భారత దేశం గొప్పతనం ఏంటంటే? ఒక ముస్లింని.. అంటే అబ్దుల్ కలాం, జాకీరుస్సేన్ లాంటి వ్యక్తలను రాష్ట్రపతిని చేసిందనే విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫాంటియర్ గాంధీ అని చెప్పుకునే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ను ఎంత గౌరవిస్తామో తెలిసిందేనని తెలిపారు. పనిలో పనిగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్‌ను పవన్ ఏకి పారేశారు.
భిన్నత్వంలో ఏకత్వంలో భారత్‌లో దూరమవుతుందనే అర్థమొచ్చేలా ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ ధీటుగా సమాధానమిచ్చారు. ఎప్పుడైనా సరే ఒక హిందువును పాకిస్థాన్ ప్రెసిడెంట్‌గా చూపించగలరా అని అడిగారు. హిందువుల ప్రాణాలకు మీరు నిజంగా రక్షణ కల్పించగలరా? అని ప్రశ్నించారు. భారత్‌లో అన్యాయం జరిగితే కులం, మతం, ప్రాంతం అనే ఏ బేధం లేకుండా వారికి మద్దతిచ్చేందుకు అనేకమంది వున్నారని వివరించారు.