Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటూ పిచ్చి.. కంటిచూపు పోగొట్టుకున్న మోడల్... ఎలా?

ఇటీవలి కాలంలో సాహస సెల్ఫీలు దిగుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు టాటూలు వేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారు.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (08:31 IST)
ఇటీవలి కాలంలో సాహస సెల్ఫీలు దిగుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు టాటూలు వేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా ఓ మోడల్ కనిగుడ్డుపై టాటూ వేయించుకుని కంటిచూపు పోగొట్టుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కెనడాకు చెందిన మోడల్ కాట్ గాల్లింగర్. తన కుడి కన్ను తెల్ల గుడ్డుకు పర్పుల్ కలర్ ఇంక్‌తో టాటూ వేయించుకుంది. కొన్ని నెలల క్రితం తను ఈ సాహసానికి పూనుకున్నది. ఇంక్‌ను కనుగుడ్డుకు వేసుకున్న మొదటి రోజు నుంచే తనకు కనుచూపు మందగించడం స్టార్ట్ చేసిందట. అంతేకాదు.. రోజూ తన కంట్లో నుంచి ఆ కలర్ కారుతూ ఉంటుందని చెప్పుకొచ్చింది. 
 
ఇంక్ వల్ల కన్నుకు ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు కన్ను మసకమసక కనిపిస్తుంది. కంటి సమస్య నుంచి బయట పడటానికి కాట్ వాడని మందులు లేవు.. తిరగని హాస్పిటల్స్ లేవు. ఏం చేసినా.. కంటి చూపును మాత్రం తిరిగి సంపాదించడం అసాధ్యమని వైద్యులు తేల్చేశారు. దీంతో మసక మసకగా కనిపిస్తున్న కంటితో, ఇన్ఫెక్షన్‌తో వస్తున్న నొప్పిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదట కాట్. 
 
అంతేకాదండోయ్.. తనలాంటి సమస్య మరెవరికీ రాకూడదని ఫేస్‌బుక్ వేదికగా తన స్టోరీని అందరితో పంచుకొని.. ఎవరూ ఇటువంటి సాహసాలకు ఒడికట్టొద్దని తన కన్ను ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను మేల్కొలుపుతున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments