Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చార్మి కుడికాలిపై టాటూ... అదీ బూతు పదాలతోనా?

తమకునచ్చిన శరీరభాగాలపై టాటూలు వేయించుకునే సెలెబ్రిటీల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు ఈ కోవలో ఎక్కువగా ఉంటారు. వీరిలో కూడా చెన్నై చిన్నది త్రిష ఇతర హీరోయిన్లకు ఆదర్శంగ

చార్మి కుడికాలిపై టాటూ... అదీ బూతు పదాలతోనా?
, గురువారం, 22 జూన్ 2017 (16:21 IST)
తమకునచ్చిన శరీరభాగాలపై టాటూలు వేయించుకునే సెలెబ్రిటీల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు ఈ కోవలో ఎక్కువగా ఉంటారు. వీరిలో కూడా చెన్నై చిన్నది త్రిష ఇతర హీరోయిన్లకు ఆదర్శంగా ఉందనే చెప్పొచ్చు. ఈ అమ్మడు ఎదపై, బొడ్డు చుట్టూత టాటూ వేయించుకుని వార్తల్లోకెక్కింది. ఇపుడు టాలీవుడ్ నటి చార్మీ అలియాస్ చార్మీ కౌర్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. 
 
నిజానికి చార్మీకి ఇలాంటివి అంటే అస్సలు ఇష్టముండదు. కానీ, ఎందుకనో ఆమె కూడా పూర్తిగా మారిపోయింది. ఫలితంగా తన కుడికాలిపైనా, చేతి వేలిపైనా టాటూ వేయించుకుంది. పైగా, ఈ టాటూ కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంది. పైగా, చేతిమీద వేయించుకున్న దానికంటే.. కాలికాలిపైనా వేయించుకున్న టాటూ మాత్రం చర్చనీయాంశంగా మారింది.
webdunia
 
"సి ప్యూడ్స్ టోకర్ ఎల్ అల్మా.. ప్యూడ్స్ టోకర్ ఎల్ క్యూలో" అంటూ కాలిపై రాయించుకుంది. దానర్థం ఏంటో తెలుసా...? ఇంగ్లీష్‌లో చెప్పాలంటే 'If You Can Touch The Soul, You Can Touch The Butt/Ass' అని అర్థం.. అంటే "అంతరాత్మకు చేరువకాగలిగితేనే.. శారీరకంగా కూడా దగ్గరైనట్టు" అని సంపూర్ణ అర్థం. ఒకవేళ దానినే బూతుగా అర్థం చేసుకుంటే మాత్రం.. విపరీతార్థం ధ్వనిస్తుంది.
 
ఇక, తన చేతిపై ‘లిమిటెడ్ ఎడిషన్’ అనే టాటూను కూడా పొడిపించుకుంది. ఈ టాటూలపై చార్మీ ట్విట్టర్‌లో స్పందించింది. ‘‘ఎట్టకేలకు టాటూ వేయించుకున్నాను. నా తొలి టాటూను వేయించుకోవడం పూర్తి కాకుండానే.. రెండో దానికి సిద్ధమైపోయాను. టాటూలకు అడిక్ట్ అయిపోయా. చాలా స్వేచ్ఛగా అనిపిస్తోంది. టాటూలంటే భయం పోయింది’’ అని ట్వీట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'డార్లింగ్'కు బాలీవుడ్ నిర్మాత రూ. 150 కోట్ల డీల్... ఇండియన్ హీరోలు షాక్...